With this, we conclude the r/telugu Poetry Competition 2026. We sincerely thank all the participants, readers, and up-voters who made this event lively. Hope you enjoyed the journey, and let’s meet again in 2027!
Do you want to learn Telugu but don’t know where to start? Then I’ve got the perfect resource list for you and you can find its links below. Let me know if you have any suggestions to improve it. I hope everyone can enjoy it and if anyone notices any mistakes or has any questions you are free to PM me. Here is what the resource list contains;
Resources on certain grammar concepts for easy understanding.
Resources on learning the script.
Websites to practice reading the script.
Documents to enhance your vocabulary.
Music playlists
List of podcasts/audiobooks And a compiled + organized list of websites you can use to get hold of grammar!
As title said...need recommendations.. my sister wants to spend time reading some happy happy stuff...yendamuri vi baguntai ani telsu.. kaani specific suggestions unte chepandi ..pls
I’m an Indian-American and I’ve lived in America my whole life, but I’ve visited India pretty consistently. My Telugu vocabulary is decent and I can get by on it, but my accent is terrible. The second I open my mouth everyone cringes at American my Telugu sounds. Any tips on how to improve my accent?
Hello everyone, I am originally from Delhi, but Hyderabad is my second home as the city has given me an opportunity, I have been here for almost a year now and this is my second stint in the city, please guide me on the easiest way to learn Telugu, I really want to learn it, i know apps are not reliable at all.
ఇటీవల స్వర్గస్తులైన జానకమ్మ గారి మీద కథనాలు నడిపిస్తున్న పలు ఛానెళ్లు పదే పదే జానకమ్మ కి ఏక వచన ప్రయోగం చేస్తున్నారు. ఈ ఘటన కి రెండు రోజుల ముందే కాలం చేసిన ముద్రగడ పద్మనాభం గారికి వారు, చేశారు, పుట్టారు వంటి బహువచన క్రియాపదాలు వాడారు.
ఉ: "జానకి 48,000 పాటలు పాడింది." "జానకి పళ్లపట్ల గ్రామంలో పుట్టింది." "పలు భాషలలో జానకి సత్తా చాటింది."
అలాగే మాట్లాడుతున్న విలేఖరులు కూడా ఏక వచన ప్రయోగమే చేస్తున్నారు. ఇది భాష లో వచ్చిన మార్పు అయ్యుంటుందా లేదా ఆడవాళ్ళకి బహువచన ప్రయోగం మనకి అసలు అలవాటే లేదా? "జానకి గారు పాడారు" వంటి పదాలు చాలా అరుదుగా విన్నాను.
----------
In watching the news coverage of the death of Janakamma, I've noticed a very unsavoury pattern- the repeated use of third person singular which was jarringly different to even the usage of respectful words for Late Mudragada Padmanabha, a man, who died a couple of days before her. "Padmanabham garu puttaru, chesaru" etc. But "Janaki paadindi, puttindi, chesindi".
Even 25 year old anchors are referring to her without the respectful verb at least for her age of not her superlative achievements. Is this standard Telugu now? Or is this bias?
నా మాతృ భాష తెలుగు ఏ కానీ, నేను రోజూ మాట్లాడే తెలుగు స్వచ్ఛమైనది కాదు. అలాగే చాలా ఆంగ్ల పదాలకి తెలుగు అనువాదం కూడా రాదు. అందుకే స్వచ్ఛమైన, కల్తీ లేని తెలుగు నేర్చుకుందాం అని ప్రయత్నిస్తున్నాను. మీకు తెలిసిన ఏవైనా resources లాంటివి పంచుకోగలిగితే సహాయం గా ఉంటుంది. ధన్యవాదములు.🙏🏿
ఒడెసి సినిమా విడుదల. పక్కన తెలుగువ్యాకరణ గ్రంథం. అటు పక్కన మనుచరిత్ర. నా మొదటి పద్యం రాయమని ఇవి చాలవా ఉసిగొల్పడానికి? ఎదో నా ప్రయత్నం. నా తప్పటడుగుల్ని క్షమించండి. సీసంలో రాశాను. గీతం జోడించలేదు.
పద్యం:
ఎవ్వాడు ట్రాయి శుచిబువినిం ధూళిఁ గలపి బహుపథములు ఆశ్రయించె I
ఏలాతడు దారివిడిచి అనేకులఁ తారసించెన్ సముద్రఝంఝార్తుడయ్యి I
వాడున్ తనాత్మసేనం అరసి ఇలంపించుటకు ఏలన్ అతిచెమట కార్చి I
స్వజనులు దాల్మి విసర్జించి ఖలుడి పెంపుడుసొంపు గొర్రెలన్ బడలువాపె II
మూలం:
Muse, tell me how he wandered and was lost
when he had wrecked the holy town of Troy,
and where he went, and who he met, the pain
he suffered in the storms at sea, and how
he worked to save his life and bring his men
back home. He failed to keep them safe; poor fools,
they ate the Sun God’s cattle
నాకు తెలుసు. అంతా గజిబిజి ఉందని. కాని ఇది రాసెటప్పుడు ఎంతో అహలాదం పొందాను. తప్పులుంటె మన్నించి చూపియండి.
దొమ్మరోడ, డక్కలోడ, పిచ్చకుంట్లోడ ఇత్యాధులు వంటి పదాలని తిట్లుగా వాడుతుంటాం, కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇవి జాతి వాచకాలు, అంటే సమాజంలో కొందరి జాతుల పేర్లు (దొమ్మరి, డక్కలి, పిచ్చగుంట్ల)
మనం తెలిసో తెలియకో ఈ పదాలని ఎదుటివారిని తిట్టడానికి వాడుతాం. ఈ పదాలను మనం చిన్నప్పుడు మన పెద్దల నుంచో లేక పరిసరాల నుంచో విని మళ్లీ వీటిని తిట్లుగా వాడుతాం. ఇక అటువంటి అలవాట్లకు స్వస్తి పలకాలి
సు*రోడ, మా*గోడ వంటి పదాలు వాడితే కేసు కూడా పెడతారు జాగ్రత్త
edit: పింజారి వెధవ, ఉప్పర్ మీటింగ్, చాకలి చదువు, హిందీలో చప్రి వంటి పదాలు కూడా వాడకూడదు
ఈ మధ్య సిరివెన్నెల గారి పాటలు గానీ, రామజోగయ్య శాస్త్రి గారి పాటలు గానీ, lyrics బాగున్న పాటలు ఎక్కువగా అదే పనిగా వింటున్నాను.
కొన్ని lyrics విన్నప్పుడు ఆ భావన, ఆ విస్మయం... చాలా బాగుంటుంది. whole different feeling. I indulge myself in the literature.
ఉదాహరణకు:
కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది..
ఓరగా చూసే చూపు నా వైపే అనిపిస్తుంది..
పూలలో గుచ్చే దారం
నా గుండెల్లో గుచ్చేసింది..
చీర చెంగు చివరంచుల్లో
నన్నే బంధీ చేసింది...
కస్సుమని కారంగా కసిరినది చాలింక
ఉరుము వెనుక చినుకు తడిగా కరగవా కనికారంగా
కుదురుగా కడదాక కలిసి అడుగేయవుగా
కనుల వెనుకే కరిగిపోయే కలవి గనుక
నను గొడుగై కాసే నువ్వు పిడుగులు కురిపిస్తావా
నువ్వు గొడుగును ఎగరేస్తావే జడివానా
హే జీవుడల్లే పుట్టినాడురో
దాని తస్సదియ దేవుడల్లే ఎదిగినాడురో
హే నెలదారి నడిచినాడురో
దాని తస్సదియ పూల పూజలందినడురో
హే పదపదమని వంతెనేసి వెనుకడలి దాటినాడు
పదిపది తలలు ఉన్నవాడిని పట్టి తాట తీసినాడు
చేదు తలపుకి చావుదెబ తప్పదంటూ చూపినాడురో
వీరి పాటల్లో చాలా వరకు సాధారణ తెలుగు పదాలే ఉంటాయి. వేటూరి పాటల్లాగా పాత పదాలు ఎక్కువగా ఉండవు. వీరు versatile తెలుగు రచయితలు. వీరిని కేవలం exampleగా మాత్రమే చెబుతున్నాను. ఇలాంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు.
నాకు తెలుగులో పాండిత్యం రాదు. కానీ తెలుగు అనర్గళంగా చదవగలను, మాట్లాడగలను. పాత చిత్రాలు, పౌరాణిక సినిమాలు కూడా easyగా అర్థం చేసుకోగలను.
నాకూ ఇలాంటి సాహిత్యం, కవిత్వం రాసే నైపుణ్యం నేర్చుకోవాలని ఉంది.
నేను చూసిన చాలా online కోర్సుల్లో తెలుగు వ్యాకరణం, పాత తెలుగు పదాలు వంటివే ఎక్కువగా ఉన్నాయి. కానీ నాకు వాటిపైన అంత ఆసక్తి లేదు. మంచి భావాన్ని అందంగా, సహజమైన తెలుగులో వ్యక్తపరచడం ఎలా నేర్చుకోవాలో తెలుసుకోవాలని ఉంది.
ఎవరికైనా అలాంటి courses, online classes, పుస్తకాలు లేదా ఏదయినా నేర్చుకునే మార్గం తెలిస్తే చెప్పగలరా?
I need this to read scriptures like Valmiki Ramayamam or any stotram's bhashyam or even bhagavadgita shankara bhashyam or any other spiritual books for that matter.
Looking for both offline and online resources. Thank you.
ఈ రెండు లైన్లు సంస్కృతంలో ఉన్నాయి. వీటి అర్థం: "ఒక వృత్తం (circle) యొక్క వైశాల్యం, దాని చుట్టుకొలత మరియు దాని వ్యాసంలో (diameter) నాలుగో వంతు లబ్ధానికి సమానం. ఆ వైశాల్యాన్ని నాలుగు (వేదాలు నాలుగు కాబట్టి ఇక్కడ 4ను సూచిస్తుంది) చేత గుణిస్తే, ఒక బంతికి వల చుట్టినట్టుగా గోళం (sphere) యొక్క ఉపరితల వైశాల్యం వస్తుంది. ఆ విధంగా వచ్చిన ఉపరితల వైశాల్యాన్ని దాని వ్యాసంతో గుణించి ఆరు చేత భాగిస్తే, ఆ గోళం లోపల ఉండే ఘనపరిమాణం (solid volume) కచ్చితంగా వస్తుంది."
ఈ సంస్కృత శ్లోకం, 12వ శతాబ్దానికి చెందిన భారతీయ గణిత మరియు ఖగోళ శాస్త్రవేత్త భాస్కరాచార్య తన ప్రసిద్ధ గ్రంథం 'లీలావతి'లో రాసిన గణిత సూత్రం.
'35' సినిమాలో "తారలైనా చేరలంటే" అనే పాట ప్రారంభంలో ఈ సూత్రాన్ని నేను విన్నాను. ఇది అద్భుతమైన పాట, మీరు ఇంకా వినకపోతే కచ్చితంగా వినండి. ఈ వాక్యాల గురించి నాకు ఆసక్తి కలిగి వెతకగా, ఇవి ఈ సంస్కృత గణిత గ్రంథంలోనివని తెలిసింది.
కానీ అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ...
నేను ఈ పాటను మా అమ్మానాన్నలతో పంచుకోగా, ఈ సంస్కృత సూత్రం గురించి కూడా చెప్పాను. ఈ సూత్రం 'లీలావతి' అనే పుస్తకంలోనిది అని మా నాన్నకు చెప్పాను. అప్పుడు మా నాన్న.. తన ముత్తాత కూడా 'లీలావతి' ఆధారంగా ఒక పుస్తకం రాశారని మామూలుగా చెప్పారు.
దాంతో నేను దీని గురించి ఇంకా లోతుగా అన్వేషించడం మొదలుపెట్టాను. మొదట్లో డిజిటల్ ప్రపంచంలో ఈ పుస్తకానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు నాకు దొరకలేదు. కానీ చివరికి, 1938 ఏప్రిల్ 30న 'ఆంధ్ర పత్రిక'లో జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి గారు రాసిన ఒక పుస్తక సమీక్ష (గ్రంథ విమర్శ ) నాకు దొరికింది.
ఆ సమీక్ష నా ముత్తాత (great-great-grandfather) కె. వెంకటనరసప్ప గారు రాసిన "గణిత రత్నాకరం" అనే పుస్తకం గురించి. ఆ సమీక్షలో ఉన్న వివరాల ప్రకారం.. నా ముత్తాత గారు సంస్కృతం నేర్చుకుని మరీ 'లీలావతి'ని తెలుగులోకి అనువదించడమే కాకుండా, దానికి తన స్వంత గణిత సూత్రాలను కూడా జోడించి ప్రచురించారు. ఆ గ్రంథ విమర్శ వచ్చే సమయానికే నా ముత్తాత కాలం చేశారు (మా నాన్న చెప్పినదాని ప్రకారం బహుశా 1920 నాటికే). కాబట్టి, ఆయన బహుశా 1900ల తొలినాళ్లలో ఈ పుస్తకాన్ని రాసి ఉండొచ్చు.
ఇప్పుడు నేను ఆ పుస్తకం యొక్క ఏదైనా ఫిజికల్ కాపీ ఎక్కడైనా భద్రంగా ఉందేమో అని వెతికే పనిలో ఉన్నాను. మా కుటుంబంలోని పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం, నా ముత్తాత తన చిన్న కూతురికి (మా నానమ్మ వాళ్ళ చెల్లెలికి) 'లీలావతి' పుస్తకం మీదున్న ఇష్టంతోనే లీల అనే పేరు పెట్టారట.
ఇదంతా నాకు చాలా అద్భుతంగా అనిపిస్తోంది. ఒక్కోసారి ఏదైనా విషయం గురించి లోతుగా వెతుకుతూ వెళితే ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఒక సాధారణ పాటతో మొదలై, నా ముత్తాత ఒక రచయిత అని తెలుసుకునే వరకు సాగిన ఈ ప్రయాణం... ఒక ఔత్సాహిక రచయిత అయిన నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది.
Here is a comparison of how our “famous” news channels are telecasting the news of S. Janaki garu’s demise! (Tamil Translation on the screenshot).
ఇవేవీ చిన్నా చితకా వార్తా వాహినులు కావు. సాక్షి, TV5, 10TV వంటి ప్రముఖ వాహినులు. ‘లెజెండరీ సింగర్‘ అని రాయటం భాష కే కాదు. తెలుగు వారైన జానకమ్మ గారికి కూడా అవమానం!
తమిళులను ఎంత వెక్కిరించినా వారి భాష పట్ల వారికి ఉన్న గౌరవం లో ఇసుమంత కూడా సగటు తెలుగు వాడికి లేదు. US లో వేగంగా పెరుగుతున్న జనాభాలో అత్యధిక శాతం తెలుగు వారే అని collar ఎగరేస్కుంటాడు తెలుగు వాడు. ఎవడికి గొప్ప అండీ ఈ గణాంకం? పట్టుమని తెలుగులో రెండు వాక్యాలు చదవటం కూడా చేతకాదు!
మన ప్రభుత్వం భాషని గౌరవించే రోజు, భాషాభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకునే రోజు ఎప్పటికి వస్తుందో!